News May 24, 2024
T20WC జట్టు ప్రకటించిన పాకిస్థాన్
టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు కెప్టెన్సీ బాధ్యతలు బాబర్ ఆజంకు అప్పగించింది.
జట్టు: బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్, హరీస్ రవూఫ్, అబ్బాస్ అఫ్రిది, నసీమ్ షా, ఆజం ఖాన్, ఇఫ్తికార్, అమీర్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమాద్, షాదాబ్.
>> అమెరికా, వెస్టిండీస్లు వేదికలుగా జూన్ 2 నుంచి ఈ వరల్డ్ కప్ జరగనుంది.
Similar News
News January 16, 2025
కేటీఆర్ విచారణ.. ఈడీ ఆఫీస్ వద్ద హైడ్రామా
TG: ఈడీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. కేటీఆర్ విచారణ ముగిసిందని తెలిసి బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అక్కడే ఉంటామని పలువురు కార్యకర్తలు తెగేసి చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కేటీఆర్ బయటికి వస్తారా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది.
News January 16, 2025
ముగిసిన కేటీఆర్ విచారణ
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
News January 16, 2025
87 మంది పిల్లలకు తండ్రి.. NEXT టార్గెట్ ప్రతి దేశంలో ఓ బిడ్డ
USకు చెందిన కైల్ గోర్డీ ప్రపంచ ప్రఖ్యాత స్పెర్మ్ డోనర్. bepregnantnow వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో 87 మంది పిల్లలకు తండ్రయ్యారు. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 100కు చేరనుంది. 2026 నాటికి ప్రతి దేశంలో ఓ పిల్లాడికి తండ్రవ్వడమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడం సంతోషంగా ఉందంటున్నారు.