News June 19, 2024
T20WC: నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు
టీ20 వరల్డ్ కప్‌లో నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ గ్రూప్-2లోని యూఎస్ఏ, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో సంచలనాలు చేసిన అమెరికా ఈ మ్యాచులో ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Similar News
News February 3, 2025
బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు: మంత్రి
TG: <<15340893>>కులగణనపై<<>> సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. ఈ విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తాం. కొందరు సర్వేకు సహకరించలేదు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఒక్కరే వివరాలు ఇచ్చారు. కాస్ట్ సెన్సస్ డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు’ అని కోరారు.
News February 3, 2025
ఆ రైలు ఎంత లేటుగా వచ్చిందో తెలుసా!
నీవెక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారో సినీకవి. నిత్యం లక్షలాదిమందితో వేలాది గమ్యస్థానాల మధ్య ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్థం చేసుకోదగినదే. కానీ మరీ 72 గంటల లేటైతే? అనధికారిక వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని కోటా నుంచి పట్నా వెళ్లాల్సిన 13228 నంబర్ రైలు 2017లో 72 గంటలు లేటుగా వచ్చింది! రైల్వే అధికారిక వివరాల ప్రకారం ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ (2014లో 71 గంటలు) పేరిట ఉంది.
News February 3, 2025
వావ్ రూ.1499 విమాన టికెట్
ఎయిర్ ఇండియా ‘నమస్తే వరల్డ్ సేల్’ లో భాగంగా రూ.1499 విమాన ప్రయాణం కల్పించనుంది. దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్స్ రూ.1499, ప్రీమియం ఎకానమీ రూ.3,749 కు ప్రారంభంకానున్నాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.9,999 మెుదలవుతాయి. ఈ నెల6వరకూ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎయిర్ఇండియా అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి12 నుంచి అక్టోబర్31తేదీలలో ప్రయాణించవచ్చు.