News June 17, 2024

T20WC సూపర్-8: గ్రూప్-1, గ్రూప్-2లో జట్లివే..

image

టీ20 WCలో కీలకమైన రెండో దశకు తెర లేవనుంది. రేపటి నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఇందులో జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్-1లో భారత్, AUS, అఫ్గానిస్థాన్, బంగ్లా చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో USA, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరుతాయి. భారత్ 20న ఆఫ్గానిస్థాన్, 22న బంగ్లా, 24న AUSతో ఆడనుంది.

Similar News

News September 16, 2025

BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

News September 16, 2025

కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.

News September 16, 2025

దసరా సెలవులు ఎప్పుడంటే?

image

AP: స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మైనారిటీ పాఠశాలలకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు SEP 28 నుంచి OCT 5 వరకు హాలిడేస్ ఉంటాయి. అటు తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.