News June 28, 2024
T20WC: ఫైనల్‌కు టీమ్ ఇండియా

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి మూడో సారి ఫైనల్లో అడుగు పెట్టింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 103 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25) కాసేపు పోరాడారు. మిగతావారంతా ఘోర వైఫల్యం చెందారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశారు.
Similar News
News December 7, 2025
రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News December 7, 2025
రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్లైన్లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 7, 2025
కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.


