News June 24, 2024
T20WC: పడి లేచిన కెరటం ఇంగ్లండ్..!

టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జర్నీ పడుతూ లేస్తూ కొనసాగుతోంది. లీగ్ స్టేజీలోనే దాదాపు ఎలిమినేట్ అయ్యే దశకు ఆ జట్టు చేరుకుంది. మరో 15 నిమిషాలు వర్షం కురిసుంటే ఇంగ్లండ్ అప్పుడే టోర్నీ నుంచి నిష్క్రమించేది. చివరకు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నమీబియాపై గెలిచింది. సూపర్-8కు చివరగా అర్హత సాధించింది ఇంగ్లండ్ జట్టే. అలాగే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టు కూడా ఇదే.
Similar News
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు పఠించాల్సిన మంత్రాలు, పలకాల్సిన నామాలు

* శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం
* ఓం విష్ణవే నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః.
News December 30, 2025
నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

మకరవిళక్కు పండుగ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. పవిత్రమైన దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పూజల నేపథ్యంలో స్వామి దర్శనానికి లక్షల మంది తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మండల పూజ తర్వాత శనివారం రాత్రి ఆలయాన్ని <<18690795>>మూసివేసిన<<>> విషయం తెలిసిందే.
News December 30, 2025
కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది

వరి పంట పండే సమయంలో కంకి (వరి వెన్ను) సహజంగా బంగారు వర్ణంలో ఉండాలి. కానీ, విపరీతమైన వర్షాలు కురిసినా లేదా ఏదైనా తెగులు సోకినా కంకులు ఎర్రగా మారిపోతాయి. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడం చూసి రైతు కన్ను ఎర్రనౌతుంది (అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి). పంట దిగుబడి, స్థితికి.. రైతు మనస్తత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.


