News June 14, 2024

T20WC: సూపర్-8కి US.. పాక్ ఔట్

image

T20WCలో యూఎస్ఏ-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో చెరో పాయింట్ దక్కింది. గ్రూప్-Aలో మొత్తం 5 పాయింట్లతో అమెరికా సూపర్-8కు చేరగా, పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యింది. WCలో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే గ్రూప్ దశ దాటిన టీమ్‌గా US రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 2 ఓటములు, ఓ విజయంతో పాక్ ఖాతాలో 2 పాయింట్లు ఉన్నాయి. 16న ఐర్లాండ్‌పై గెలిచినా 4 పాయింట్లే ఉంటాయి.

Similar News

News September 15, 2025

రోడ్డు వేసి 50 ఏళ్లు.. అయినా చెక్కుచెదరలేదు!

image

ప్రస్తుతం రూ.వేల కోట్లతో నిర్మించిన రోడ్లు చిన్న వర్షానికే ధ్వంసమవుతున్నాయి. కానీ 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ రోడ్డు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. అదే మహారాష్ట్ర పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు(JM రోడ్). దీనిని 1976లో ‘రెకాండో’ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. అధిక నాణ్యత గల పదార్థాలు, సాంకేతికత వాడటంతో 10ఏళ్ల గ్యారెంటీ కూడా ఇచ్చింది. ఇంత నాణ్యమైన రోడ్డు నిర్మించిన ఆ సంస్థకు మరో కాంట్రాక్ట్ ఇవ్వలేదట.

News September 15, 2025

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

image

సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైలు బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 15నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో టికెట్లు బుక్ చేసుకొనే వీలుంటుంది. OCT 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్‌కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్లకూ వర్తింపజేయనుంది. SHARE IT.

News September 15, 2025

భారీగా తగ్గిన స్విఫ్ట్ కారు ధర

image

GST సంస్కరణల నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కారు ధర వేరియంట్స్‌‌ను బట్టి రూ.55 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.06లక్షల వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్(ఎక్స్ షోరూం) రూ.5.94 లక్షలకు చేరింది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ.2.77 లక్షలు, ఎస్-ప్రెస్సో రేట్ రూ.3.90 లక్షలు, వాగన్R ధర రూ.5.26 లక్షలు, డిజైర్ రేట్ రూ.6.24 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.