News June 15, 2024
T20WC: చరిత్ర సృష్టించిన యూఎస్ఏ!
టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజీ నుంచి సూపర్-8కు చేరిన ఏడో అసోసియేట్ జట్టుగా USA చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా ఐర్లాండ్తో మ్యాచ్ రద్దవడంతో USA నేరుగా సూపర్-8కు చేరుకుంది. అంతకుముందు ఐర్లాండ్ (2009), నెదర్లాండ్స్ (2014), అఫ్గానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021), నెదర్లాండ్స్ (2022) ఉన్నాయి. కాగా 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే T20 WCకు కూడా USA అర్హత సాధించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 26, 2024
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం ఆవేదన
TG: సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలిపారు. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు.
News December 26, 2024
కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?
TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.
News December 26, 2024
బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.