News June 3, 2024

T20WC: పపువా న్యూగినియాపై విండీస్ విజయం

image

టీ20 ప్రపంచకప్‌లో పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌‌లో వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ ప్రత్యర్థిని 136 పరుగులకు కట్టడి చేసింది. అయితే లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు చెమటోడ్చారు. సునాయాసంగా గెలుస్తారని అనుకున్న మ్యాచ్‌ 19వ ఓవర్ వరకు కొనసాగింది. బ్రాండన్ కింగ్ 34(29), ఛేస్ 42*(27) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Similar News

News September 18, 2025

eAadhaar App.. ఇక మనమే అప్డేట్ చేసుకోవచ్చు!

image

ఆధార్ కార్డులో అప్‌డేట్స్ కోసం ఇక ఆధార్ సెంటర్లు, మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం eAadhaar App తీసుకొస్తోంది. ఇందులో ఆన్‌లైన్‌లోనే పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడీ టెక్నాలజీ వల్ల డిజిటల్ ఆధార్ సేవలు సురక్షితంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నవంబర్‌లో యాప్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

News September 18, 2025

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి తదితర జిలాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది.

News September 18, 2025

ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్

image

AP: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమి ప్రభుత్వానికి లేదని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు టైం ఉంటుంది. ఆ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కానీ మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. సభ్యులకు కూడా రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం’ అని అన్నారు.