News March 23, 2024

ట్యాగ్స్ మారాయి

image

స్టార్ ట్యాగ్ ప్రతి హీరోకు ఉంటుంది. అది ఫ్యాన్స్‌కి ఓ ఎమోషన్. అభిమాన నటుడిని ఆ ట్యాగ్‌తో పిలిచేందుకు ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే హీరో రేంజ్ పెరిగేకొద్దీ ఈ ట్యాగ్ పేర్లూ మారుతున్నాయి. ‘పుష్ప’కి ముందు అల్లు అర్జున్‌కి స్టైలిష్ స్టార్ అని ఉండగా తర్వాత ఐకాన్ స్టార్ అయ్యారు. RRR తర్వాత యంగ్ టైగర్ కాస్తా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌గా ట్యాగ్స్ మారాయి.

Similar News

News October 2, 2024

రాహుల్, ప్రియాంక.. మీ మంత్రుల మాటలు వినండి: BRS

image

KTRపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరమని BRS స్పందించింది. ‘రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్, ప్రియాంకా గాంధీ.. మీ పార్టీ నేతల మాటలు వినండి. వాళ్లు మహిళలు, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను పబ్లిక్‌లోకి లాగుతున్నారు. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనాలోచిత వ్యాఖ్యలతో మీ పార్టీకి సమాధి తవ్వుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

News October 2, 2024

మేం పనిగట్టుకొని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదు: మంత్రి సీతక్క

image

TG: తామేమీ పనిగట్టుకొని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడామని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అన్నారు. తాము సినీ నటులకు వ్యతిరేకం కాదని, వాళ్లను ద్వేషించడం లేదని స్పష్టం చేశారు. KTR తమను శిఖండి అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. తమ నోళ్లను పినాయిల్‌తో కడగాలన్న KTR నోటినే యాసిడ్‌తో కడగాలని ధ్వజమెత్తారు.

News October 2, 2024

ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్!

image

ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో హెలెన్ హరికేన్ కారణంగా క్వార్ట్జ్ ఉత్పత్తి ఆగిపోయింది. బ్రెజిల్, రష్యాల్లో క్వార్ట్జ్ లభించినా.. సెమీకండక్టర్లలో ఉపయోగించే నాణ్యమైన క్వార్ట్జ్ నార్త్ కరోలినాలోనే దొరుకుతుంది. వరదల కారణంగా విద్యుత్ సరఫరా, రవాణా ఆగిపోవడంతో సప్లై చైన్ తెగిపోయింది.