News April 10, 2025
నేరుగా తిహార్ జైలుకు తహవూర్ రాణా!

26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా(64)ను అధికారులు US నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొస్తున్నారు. మధ్యాహ్నంలోపు అతడు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడికి రాగానే రాణాను NIA అధికారికంగా అరెస్ట్ చేయనుంది. అనంతరం అతడిని తిహార్ జైలులోని హైసెక్యూరిటీ వార్డులో ఉంచనున్నారు. 2008 NOV 26న ముంబైలోని తాజ్ హోటల్లో 10 మంది పాకిస్థానీ టెర్రరిస్టుల నరమేధం వెనుక రాణాదే మాస్టర్ మైండ్.
Similar News
News April 18, 2025
స్టేషన్ల సుందరీకరణ కాదు.. రైళ్లను పెంచండి: నెటిజన్లు

అమృత్ భారత్ స్కీమ్ కింద కేంద్రం రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. TGలోని సికింద్రాబాద్, బేగంపేట, వరంగల్ తదితర రైల్వే స్టేషన్లను సుందరీకరిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ట్రాక్స్‌ను పునరుద్ధరించడం, మరిన్ని రైళ్లను పెంచడానికి బదులుగా స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. సీట్ల లభ్యత, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 18, 2025
చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్

వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్‌తోపాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.
News April 18, 2025
నితీశ్ ఈసారి అంతంతమాత్రమే..!

IPL: గత సీజన్లో రాణించి వెలుగులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్లో 7 మ్యాచుల్లో 6 సార్లు బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవలం 131 పరుగులే చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇలా ఉన్నాయి.. 30(15), 32(28), 0(2), 19(15), 31(34), 19(21). ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా ఆకట్టుకునేలా లేదని, ఆయన బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.