News March 7, 2025
US సుప్రీంకోర్టులో తహవూర్ రాణాకు షాక్

26/11 ముంబై ఉగ్ర దాడి కేసు నిందితుడు తహవూర్ రాణాకు యూఎస్ సుప్రీంకోర్టు షాకిచ్చింది. తనను భారత్కు అప్పగించవద్దంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. భారత్కు అప్పగిస్తే తనను చిత్రహింసలు పెడతారని అతడు పేర్కొన్నాడు. కాగా రాణాను భారత్కు అప్పగిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 6, 2026
అమ్మవారి సేవలో టీటీడీ నూతన ఈవో

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద జేఈవోలు వీరబ్రహ్మం, శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆయనకు వేదశీర్వచనంతో అమ్మవారి వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News February 6, 2026
ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నలుగురు మహిళా మావోలు సహా కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభాకర్ కూడా ఉన్నారు. గడ్చిరోలి డివిజనల్ కమిటీ అధిపతిగా ఉన్న ఆయనపై రూ.50 లక్షల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు కూడా మరణించారు. భమ్రగఢ్ తాలూకా ఫడేవా అటవీప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
News February 6, 2026
శ్రీవారిని ఉచితంగా దర్శించుకోండిలా!

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సాధారణ భక్తుల కోసం టీటీడీ పలు ఉచిత దర్శన మార్గాలను కల్పిస్తోంది. సర్వదర్శనం కోసం జనరల్ క్యూలో వెళ్లొచ్చు. టైమ్ స్లాట్ SSD టోకెన్స్తో పాటు మెట్ల నడక ద్వారా కొండపైకి వెళ్లి బయోమెట్రిక్ టోకెన్స్ పొందవచ్చు. స్థానిక భక్తులకు లోకల్ కోటా, సీనియర్ సిటిజన్లకు(65+) స్పెషల్ ఎంట్రీతో పాటు ఏడాదిలోపు పిల్లలున్న పేరెంట్స్ ‘సుపథం’ ద్వారా శ్రీవారిని వేగంగా దర్శించుకోవచ్చు.


