News June 7, 2024

తైవాన్‌ చైనాలో అంతర్భాగమే: చైనా ఎంబసీ

image

తైవాన్ చైనాలో అంతర్భాగమని భారత్‌లోని ఆ దేశ ఎంబసీ పునరుద్ఘాటించింది. వన్ చైనా పాలసీని ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపింది. చైనాతో దౌత్యసంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్ తైవాన్ నేతల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ ఇటీవల ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది. తైవాన్-భారత్ బంధం బలోపేతానికి కృషి చేయాలని లాయ్ పేర్కొనడాన్ని చైనా తప్పుపట్టింది.

Similar News

News December 8, 2025

ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

image

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.

News December 8, 2025

రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ

image

TG: వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 41.6 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు చెల్లించామని తెలిపారు. వరి కొనుగోళ్లలో 45% ఐకేపీ మహిళల భాగస్వామ్యంతో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.

News December 8, 2025

తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. చంద్రబాబు విషెస్

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు, రేపు జరిగే ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని Xలో పోస్టు చేశారు. కాగా ఈ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు.