News September 22, 2024
భారీ వర్షాలతో తాజ్ మహల్కు పగుళ్లు

భారీ వర్షాలతో తాజ్ మహల్ గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర భాగాలూ దెబ్బతిన్నాయి. ప్రధాన గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్లో ఖురాన్లోని సూరాలను చెక్కారు. ఈ ఆక్షరాలు చెదిరిపోయినట్టు TGFI తెలిపింది. తాజ్ మహల్లో ఎలాంటి సమస్యలూ లేవంటున్న ASI ఇటీవల ఏం సర్వే చేసిందని ప్రశ్నించింది. ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్పై ప్రతికూల ప్రచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని పేర్కొంది.
Similar News
News November 28, 2025
రాజన్న ఆలయంలో అద్దాల మండపం తొలగింపు పూర్తి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో అద్దాల మండపం (స్వామివారి కళ్యాణమండపం) తొలగింపు పూర్తయింది. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఫ్లోరింగ్ పూర్తిగా తొలగించారు. అద్దాల మండపం తొలగించి శిథిలాలు తరలించారు. ఉత్తరం వైపు ప్రాకారం పూర్తిగా తీసివేయడంతో పాటు బాల రాజేశ్వర ఆలయ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించారు. ధర్మగుండం రెండు వైపులా ప్రాకారం కూల్చివేశారు.
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 28, 2025
14 ఏళ్లకే ప్రేమ, జంప్.. ఎందుకిలా?

విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు(13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ.10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్స్కు అప్పగించారు.


