News January 29, 2025

సమీప ఘాట్లలో స్నానం చేయండి: యోగి సూచన

image

ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట జరిగిన సంగం ఘాట్ వద్దకు రావొద్దని UP CM యోగి ఆదిత్యనాథ్ భక్తులకు సూచించారు. తమకు సమీపంలోని ఘాట్ల వద్ద అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. భక్తకోటి కోసం వేర్వేరు ఘాట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగతా అన్ని చోట్లా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నేడు మహా కుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చినట్టు అంచనా.

Similar News

News November 28, 2025

ఆదిలాబాద్: సంతానం కలగడం లేదని వ్యక్తి SUICIDE

image

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉట్నూర్ మండలంలో బుధవారం జరిగింది. SI ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్‌కు చెందిన సయ్యద్ యూసుఫ్(58)కు సంతానం కలగడం లేదని మనస్తాపం చెందాడు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. బుధవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన భార్య భాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News November 28, 2025

APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ncpor.res.in/

News November 28, 2025

‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

image

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్. DEC 19 నుంచి ‘హైదరాబాద్‌ బుక్ ఫెయిర్’ నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 38వ బుక్ ఫెయిర్ లోగోను ఆయన ఆవిష్కరించారు. NTR స్టేడియంలో DEC 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ఫెయిర్ జరగనుంది. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. మీరూ బుక్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తున్నారా? ఈ సారి ఏ పుస్తకం కొనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.