News November 3, 2025

Take A Bow: మనసులు గెలిచిన కెప్టెన్ లారా

image

భారత్ ఉమెన్స్ WCను లిఫ్ట్ చేసినప్పుడు గెలుపు గర్జనతో స్టేడియం మారుమోగింది. అంతా విజయోత్సాహంలో నిండిపోయారు. కానీ, SA కెప్టెన్ లారా ముఖంలో విషాదం నిండిపోయింది. ఫైనల్లో సెంచరీ సహా 9 మ్యాచుల్లో 571 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా SAకి తొలి WC అందించాలన్న తన కల సాకారం కాలేదు. అయితే ఆమె పోరాటం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 3, 2025

నిజమైన శివపూజ ఇదే!

image

శివపూజకు అన్నీ ఉండాలనుకోవడం మన అపోహ మాత్రమేనని పండితులు చెబుతున్నారు. శివుడు కోరేది నిర్మలమైన మనసు మాత్రమేనని అంటున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకపోయినా భక్తితో ‘స్వామి! నన్ను రక్షించు’ అని అడిగినా ఆయన ప్రసన్నుడవుతాడని పురాణాల వాక్కు. శివుడి పట్ల మనసు స్థిరంగా ఉంచడమే అసలైన శివభక్తి అని నమ్మకం. ఆయనతో కష్టసుఖాలు చెప్పుకొని, లాలించి, అలిగి, బుజ్జగించే మానసిక అనుబంధాలే అత్యంత ప్రీతిపాత్రమైనవని అంటారు.

News November 3, 2025

ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

image

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్‌లో 15, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

News November 3, 2025

వేగం వద్దు బ్రదర్.. DRIVE SAFE

image

వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించదు. ఈ సమయంలో అతివేగం అత్యంత ప్రమాదకరం. ‘కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు.. మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడమే ముఖ్యం’ అని వారు సూచిస్తున్నారు. డ్రైవర్లు నిర్ణీత వేగ పరిమితి పాటించాలని, సురక్షిత దూరాన్ని కొనసాగించాలని అవగాహన కల్పిస్తున్నారు.