News July 13, 2024
వైసీపీ దోపిడీపై కచ్చితమైన లెక్కలు తీయండి: CM చంద్రబాబు

AP: వైసీపీ హయాంలో జరిగిన భూకబ్జాలు, సహజ వనరుల దోపిడీపై కచ్చితమైన లెక్కలు తీయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సహజవనరుల దోపిడీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు రూపొందించిన నివేదిక పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి పూర్తి వివరాలతో రావాలని, ఏ ఒక్క అంశాన్ని వదలొద్దని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
Similar News
News December 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 5, 2025
పుతిన్‌కు భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేసిన మోదీ

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత బోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు మోదీ ఘనస్వాగతం పలికారు. ఆపై ఢిల్లీ లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న PM అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు డిన్నర్లో పాల్గొన్నారు.
News December 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 5, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.07 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


