News January 15, 2025

మనోజ్‌పై చర్యలు తీసుకోండి.. మోహన్ బాబు ఫిర్యాదు

image

AP: కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 200 మందితో మోహన్ బాబు వర్సిటీలోకి <<15163428>>ప్రవేశించేందుకు<<>> మనోజ్ ప్రయత్నించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డైరీఫాం గేటు దూకి లోపలకి ప్రవేశించారని పేర్కొన్నారు.

Similar News

News November 1, 2025

వరి పొలం గట్లపై కంది మొక్కల పెంపకంతో ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.

News November 1, 2025

ఎల్లుండి నుంచి ప్రైవేటు కాలేజీల బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో ₹900Cr చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీలు విధించిన డెడ్‌లైన్ నేటితో ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎల్లుండి(NOV 3) నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. 2024-25 వరకు ₹9వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దసరాకు ముందు ₹1,200Cr రిలీజ్ చేస్తామన్న ప్రభుత్వం ₹300Cr మాత్రమే చెల్లించిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.

News November 1, 2025

చూపులేని అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్

image

దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం పరీక్షల్లో ‘స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్’ ఉపయోగించాలని UPSC నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్‌వేర్ ఏర్పాటు అంశాలను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేసింది. చూపులేని వారికి UPSC సమాన అవకాశాలు కల్పించడం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో కమిషన్ చర్యలు చేపట్టింది.