News March 4, 2025

ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: సుప్రీం

image

సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది. తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన సుప్రీం ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, TN, HP, రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది.

Similar News

News December 10, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో 7 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nise.res.in/.

News December 10, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.

News December 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 92

image

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>