News December 5, 2024
అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోండి: చంద్రబాబు

AP: ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల ఆందోళనల ఘటనలపై కృష్ణా జిల్లా కలెక్టర్‌తో CM చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమైతే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్ల అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు.
Similar News
News October 29, 2025
టీమ్‌గా పనిచేసి నష్టనివారణ చర్యలు చేపట్టాం: CM చంద్రబాబు

AP: సమర్థంగా వ్యవహరించి తుఫాన్ నష్టనివారణ చర్యలు చేపట్టామని కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో CM చంద్రబాబు అన్నారు. ‘అంతా టీమ్‌గా పనిచేశాం. ప్రతిఒక్కరికీ అభినందనలు. మరో 2 రోజులు ఇలానే చేస్తే మరింత ఊరట ఇవ్వగలం. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ సమస్యలు అడిగి తెలుసుకోవాలి. నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.
News October 29, 2025
TTD దేవాలయాలన్నిటిలో అన్నదానం

AP: ట్రస్టు డిపాజిట్లు ₹2500 కోట్లకు చేరనుండడంతో దేశంలోని తమ అన్ని దేవాలయాల్లోనూ ‘అన్నదానం’ చేయాలని TTD నిర్ణయించింది. కరీంనగర్(TG)లో ఆలయ నిర్మాణానికి ₹30 కోట్లు కేటాయించింది. అక్కడే ₹3 కోట్లతో ‘ఆధ్యాత్మిక ఉద్యానవనం’ నిర్మించనుంది. తక్కువ ధరలకు మందులు విక్రయించేలా స్విమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను ఏర్పాటు చేయనుంది. వైకుంఠ ద్వార దర్శన విధానాన్ని 10 రోజుల పాటు కొనసాగించనుంది.
News October 29, 2025
కాసేపట్లో మ్యాచ్.. రికార్డుల్లో మనదే పైచేయి!

ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియాVsభారత్ తొలి T20 ప్రారంభం కానుంది. అయితే ఆసీస్‌పై పొట్టి క్రికెట్లో మనదే పైచేయి. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. 2012లో 1-1తో సమం కాగా 2016లో 3-0 తేడాతో గెలిచింది. 2018లో మళ్లీ 1-1తో సమం చేయగా 2020లో 2-1తో సిరీస్ సాధించింది. ఇక AUS-IND మధ్య జరిగిన చివరి 8 మ్యాచుల్లో భారత్ ఏడింట్లో గెలవడం విశేషం.


