News November 26, 2024
నా సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి: స్వరూపానందేంద్ర

AP: తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి లేఖ రాశారు. ఇప్పటివరకు రక్షణ కల్పించిన YCP, TDP ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తపస్సు చేసుకుంటూ రిషికేశ్‌లోనే గడుపుతానని ప్రకటించారు. YCP ప్రభుత్వం గతంలో శారదాపీఠానికి వైజాగ్ వద్ద రూ.225Cr విలువైన 15ఎకరాలను రూ.15 లక్షలకే కేటాయించింది. కూటమి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది.
Similar News
News December 14, 2025
చీనీ తోటలకు కలుపు మందులతో ముప్పు

చీనీ తోటల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వల్ల చెట్లలో వైరస్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల ఎండు తెగులు, వేరుకుళ్లు, పొలుసు పురుగు, నల్లి, మంగు, బంక తెగులు లాంటి చీడపీడలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలుపు మందులతో తోటల జీవితకాలం తగ్గడంతో పాటు చెట్లు చనిపోతున్నట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ట్రాక్టర్ లేదా కూలీలతో కలుపు తీయిస్తే భూమి గుల్లబారి పంటకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.
News December 14, 2025
చికెన్ కిలో ధర ఎంతంటే?

APలోని VJAలో చికెన్ స్కిన్‌లెస్ కేజీ ₹270, స్కిన్ ₹260గా ఉంది. గుంటూరు(D) కొల్లిపరలో స్కిన్ చికెన్ కేజీ ₹240, స్కిన్ లెస్ రూ.260గా అమ్ముతున్నారు. నరసరావుపేటలో కేజీ స్కిన్ లెస్ ₹250, స్కిన్‌తో ₹260గా ఉంది. TGలోని హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ ₹260-₹280, స్కిన్‌తో ₹240-₹260గా అమ్ముతున్నారు. కామారెడ్డిలో చికెన్ కిలో ₹250, మటన్ కిలో ₹800 పలుకుతోంది. మీ దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి? Comment.
News December 14, 2025
362 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


