News August 27, 2024

బండి సంజయ్‌పై ధిక్కార చర్యలు తీసుకోండి: సుప్రీంకు KTR విజ్ఞప్తి

image

MLC కవిత బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన <<13951590>>ట్వీట్‌కు<<>> కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘బాధ్యతాయుతమైన హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీంకోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. ఈయనపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Similar News

News November 1, 2025

నిర్మాతగా సుకుమార్ భార్య తబిత

image

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత నిర్మాతగా మారనున్నారు. ‘తబితా సుకుమార్ ఫిల్మ్స్’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బ్యానర్‌లో పదేళ్ల కిందట వచ్చిన బోల్డ్ మూవీ కుమారి21F సీక్వెల్ కుమారి22F తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల రావు రమేశ్ నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు.

News November 1, 2025

ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

image

AP: పోలవరం భూ నిర్వాసితులకు రూ.1000 కోట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు. 2027కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.