News May 4, 2024
‘డబ్బు తీసుకుని జాబ్ ఇవ్వండి.. పని నచ్చకుంటే తీసేయండి’

ఉద్యోగం సాధించడానికి ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశారు. ‘నేను మీ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నా. నన్ను నియమించుకుంటే 500 డాలర్లు ఇస్తా. వారంలో నా పని నచ్చకపోతే జాబ్ నుంచి తీసేయండి. డబ్బు తిరిగివ్వాల్సిన పనిలేదు’ అంటూ వింగిఫై సంస్థకు దరఖాస్తు పంపారు. దీన్ని ఆ కంపెనీ ఫౌండర్ పరాస్ చోప్రా Xలో పోస్టు చేశారు. ఆ నిరుద్యోగికి తన పనితనంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News February 22, 2026
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.
News February 22, 2026
భారీగా తగ్గిన క్యారెట్, బీట్‌రూట్ ధరలు

AP: రాష్ట్రంలో క్యారెట్, బీట్‌రూట్ ధరలు పడిపోయాయి. సాధారణంగా ఇవి కేజీకి రూ.80-100 చొప్పున విక్రయిస్తారు. అయితే రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకలో క్యారెట్, బీట్‌రూట్ సాగు పెరగడంతో ధరలు దిగివచ్చాయి. దీంతో క్యారెట్, బీట్‌రూట్ కేజీకి రూ.30-40 చొప్పున లభ్యమవుతున్నాయి. అటు తెలంగాణలోనూ వీటి ధరలు కాస్త తగ్గి కేజీ రూ.50-70 మధ్య ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 22, 2026
కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్

రాయ్‌బరేలీ(UP)కి చెందిన సయీద్ అనే వ్యక్తి ₹2 విలువ చేసే చిన్న కుండలు అమ్ముతూ జీవిస్తున్నారు. ఆయనకు ఏకంగా ₹1.25 కోట్ల GST నోటీసు రావడం చూసి అవాక్కయ్యారు. ఆయన పేరిట 4 కంపెనీలు నడుస్తున్నట్లు వాటిలో ఉంది. గతంలో లోన్ కోసం ఆధార్, పాన్ కార్డులు ఇస్తే.. వాటిని ఎవరో కేటుగాళ్లు తప్పుడు వ్యాపారాలకు వాడినట్లు తెలుస్తోంది. కడు పేదరికంలో ఉన్న సయీద్.. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.


