News March 21, 2024
రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవ్: రాహుల్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి తలెత్తిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నామని తెలిపారు. విమాన ప్రయాణాల సంగతి తర్వాత.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ తమ వద్ద డబ్బుల్లేవని చెప్పారు. దేశంలో 20శాతం ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని.. కానీ రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నామన్నారు.
Similar News
News January 8, 2025
ఫార్ములా-ఈ కేసు: నేడు ఇద్దరి నిందితుల విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో ఏ2గా అరవింద్, ఏ3గా BLN రెడ్డి ఉన్నారు. HMDA నుంచి FEOకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై వీరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ఈనెల 9న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
News January 8, 2025
స్నానం ఆపేస్తే ఆయుష్షు 34% పెరుగుతుందా!
చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.
News January 8, 2025
వాట్సాప్‌లో ‘ఫొటో పోల్స్’
వాట్సాప్ ‘ఫొటో పోల్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా టెక్స్ట్‌తో అవసరం లేకుండా పోల్స్‌లో ఫొటోలను అటాచ్ చేసేందుకు వీలుంటుంది. ముందుగా ఛానల్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను ఆ తర్వాత గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్‌లోనూ ప్రవేశపెడతారని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. టెక్స్ట్‌లో చెప్పలేని విషయాలను ఫొటోలతో ఈజీగా చెప్పేందుకు ఈ ఫీచర్ సాయపడనుందని పేర్కొంది.