News October 5, 2024

రూ.10 కాయిన్లు తీసుకోండి: SBI

image

రూ.10 కాయిన్స్‌ చెల్లడం లేదనే అపోహతో చాలామంది తీసుకోవడం లేదు. ఈ అపోహ తొలగించాలనే లక్ష్యంతో SBI వరంగల్ జోనల్ కార్యాలయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు అధికారులు వ్యాపారులకు, ప్రజలకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ₹10 కాయిన్స్ చెల్లుతాయని అందరూ స్వీకరించాలని కోరారు.

Similar News

News March 17, 2026

పాస్‌బుక్ ఉన్న రైతులు భరోసాకు అప్లై చేయాలి: డీఏవో

image

ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త పట్టా పాస్‌బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ సూచించారు. పెట్టుబడి సాయం అందుకునేందుకు పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులతో పాటు దరఖాస్తు ఫారం పూర్తి చేసి తమ తమ మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో సమర్పించాలని రైతులకు తెలిపారు.

News March 17, 2026

క్లైమాక్స్‌ను సరికొత్తగా ప్లాన్ చేసిన హరీశ్ శంకర్!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో విలన్‌ని ఓడించి అంతం చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఆ రెగ్యులర్ క్లైమాక్స్‌ను బ్రేక్ చేసి సరికొత్తగా ప్లాన్ చేశాం. సినిమా చివరి వరకు ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు’’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

News March 17, 2026

ఈనెల 27న భద్రాచలానికి సీఎం రేవంత్

image

భద్రాచలంలో ఈ నెల 27న జరిగే రాములోరి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. ఉగాది రోజున బ్రహ్మోత్సవ సందడి ప్రారంభం కానుండగా.. అదేరోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ దంపతులను నవమి వేడుకలకు ఆహ్వానించనున్నారు. రూ.300 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతలో రూ.100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల వెల్లడించారు.