News December 8, 2024
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 21, 2025
గ్యారంటీలను గాలికొదిలేశారా?.. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ

TG: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ‘2 ఏళ్ల పాలనపై CM రేవంత్ను మీరు అభినందించారు. మరి 6 గ్యారంటీల అమలు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారా? లేక గ్యారంటీలను గాలికొదిలేశారా? 420 హామీలను మూసీలో కలిపేలేశారా? గాంధీభవన్లో పాతరేశారా? హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే మీ అభయహస్తమే ప్రజల ఆగ్రహంతో భస్మాసుర హస్తమవుతుంది’ అని హెచ్చరించారు.
News December 21, 2025
ధనుర్మాసం: ముగ్గులు వేస్తున్నారా?

ధనుర్మాసంలో ముగ్గులు వేయాలంటారు. తద్వారా శ్రీనివాసుడే ఇంటికి వస్తాడని నమ్ముతారు. అలాగే బియ్యప్పిండి ముగ్గు చీమలు, పక్షులకు ఆహారమవుతుంది. తద్వారా మనకు పుణ్యం వస్తుంది. ముగ్గుల మధ్యలో ఉంచే గొబ్బెమ్మలు మహాలక్ష్మి అనుగ్రహాన్నిస్తాయి. శాస్త్రీయంగా.. తెల్లవారుజామునే ముగ్గులు వేస్తే శరీరానికి ధనుర్వాయువు అనే స్వచ్ఛమైన గాలి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చుక్కల ముగ్గుతో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం పెరుగుతాయట.
News December 21, 2025
గార్డెన్ రిచ్ షిప్బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

<


