News October 30, 2024

వారిని విధుల్లోకి తీసుకోండి: కూనంనేని

image

TG: ప్రభుత్వం విధుల నుంచి డిస్మిస్ చేసిన 10 మంది ప్రత్యేక పోలీసులు, సస్పెండ్ చేసిన 37 మందిని విధుల్లోని తీసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. సమస్యలను వెల్లడించేందుకు వారు రోడ్డెక్కినట్లు పేర్కొన్నారు. వలసకాలపు ధోరణులను తొలగించి, సమస్యను పరిష్కరించాలన్నారు. అలా చేయకుండా వారిని అణచివేస్తే భవిష్యత్తులోనూ అసంతృప్తి కొనసాగే అవకాశముందన్నారు.

Similar News

News December 21, 2025

హిందువులంతా ఐక్యంగా ఉండాలి.. బంగ్లా దాడులపై మోహన్ భాగవత్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులనుద్దేశించి RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి హిందువులు ఐక్యంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హిందువులకు భారతదేశమే ఏకైక ఆశ్రయమని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం తరఫున మరిన్ని గట్టి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.

News December 21, 2025

పాకిస్థాన్‌తో ఫైనల్.. టీమ్ ఇండియా ఓటమి

image

అండర్-19 ఆసియాకప్ ఫైనల్: పాకిస్థాన్‌తో మ్యాచులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైంది. సీజన్ మొత్తం అదరగొట్టిన ఆయుశ్ సేన కీలక మ్యాచులో చేతులెత్తేసింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. హిట్టర్ సూర్యవంశీ(26), జార్జ్(16), అభిజ్ఞాన్(13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36) దూకుడుగా ఆడారు.

News December 21, 2025

₹లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు: లోకేశ్

image

AP: తిరుమల పరకామణిలో చోరీపై Ex CM జగన్ స్పందన ఆయన దోపిడీ స్థాయిని వెల్లడిస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ‘జనం సొమ్ము ₹లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు. ఈ చోరీ పెద్ద పాపం. సాక్షులు, సాక్ష్యాధారాలు లేకుండా చేసి తప్పించుకోవడానికి ఇది బాబాయి కేసో, కోడి కత్తి కేసో కాదు. వెంకన్నకు చేసిన మహా అపచారం. ఆ దేవదేవుడి కోర్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం’ అని ట్వీట్ చేశారు.