News September 11, 2025

విటమిన్ డి లోపం ఉంటే ఇవి తీసుకోండి

image

శరీరంలో హెల్తీబోన్స్‌కు కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్‌ను గ్రహించడంలో విటమిన్ డి సాయపడుతుంది. కొవ్వును కరిగించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి, గుండె, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విటమిన్ డి అవసరం. దీనికోసం ఆవు పాలు, పెరుగు వంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన తీసుకోవాలి. వీటితోపాటు లో ఫ్రీక్వె‌న్సీ సన్‌లైట్‌లో ఉంటే విటమిన్ డి లభిస్తుంది.

Similar News

News February 3, 2026

శుక్రవారమే సినిమా రిలీజ్‌లు ఎందుకో తెలుసా?

image

* శని, ఆదివారాల్లో సెలవు కావడం
* కొన్నేళ్ల క్రితం శుక్రవారం పేమెంట్స్ ఇచ్చేవారు. ఆ రోజు విడుదల చేస్తే ఫ్యామిలీస్‌తో సినిమాలకు వస్తారని భావించడం.
* 1939, DEC 15 (శుక్రవారం)న ‘Gone with the Wind’ సినిమా విడుదలై భారీ విజయం సాధించడం
* 1960, AUG 5 శుక్రవారమే విడుదలైన ‘Mughal-e-Azam’ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం
– చాలాకాలం నుంచి అదే ట్రెండ్ సౌత్‌లోనూ కొనసాగినా ఇటీవల గురువారం విడుదల చేస్తున్నారు.

News February 3, 2026

మద్యం అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు: పవన్

image

AP: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి’ అని స్పష్టం చేశారు. నిరంతర నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.

News February 3, 2026

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్

image

AP: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. FEB 8 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఫ్రీగా లడ్డూలు అందించాలని నిర్ణయించింది. అదే విధంగా క్యూలైన్లలో పాలు, బిస్కెట్లు, అల్పాహారం సైతం పంపిణీ చేయనుంది. భక్తుల సౌకర్యం కోసం మంచినీరు, మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. 14, 15వ తేదీల్లో టోల్ ఫీజు లేకుండా వాహనదారులను అనుమతించనుంది.