News November 6, 2024
ఫోన్ ఛార్జింగ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి
చాలామంది ఫోన్ ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అది ఫోన్ల పేలుళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.
* రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు. ఫోన్‌ను బట్టి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పట్టే సమయాన్ని తెలుసుకొని, అంతసేపే ఛార్జింగ్ పెట్టాలి.
* ప్లగ్ ఇన్ చేసి ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేయొద్దు.
* వంటగదుల్లో ఛార్జింగ్ పెట్టొద్దు.
* ఫుల్ ఛార్జ్ అయినా స్విచ్ ఆఫ్ చేయకపోవడం ప్రమాదకరం.
Similar News
News December 26, 2024
FLASH: వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. కాగా నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు ఏర్పడి వెదర్ చల్లగా మారింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా?
News December 26, 2024
కొత్త ఏడాదిలో చైనా, అమెరికాకు ప్రధాని మోదీ?
కొత్త సంవత్సరంలో PM మోదీ పర్యటనల క్యాలెండర్‌ను విదేశీ వ్యవహారాల శాఖ సిద్ధం చేస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ట్రంప్ అధ్యక్షుడిగా అధికారం స్వీకరించిన అనంతరం ఆయనతో భేటీ అయ్యేందుకు మోదీ US వెళ్లే అవకాశం ఉంది. ఇక బ్రెజిల్లో బ్రిక్స్, చైనాలో SCO సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. ఈక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఆయన ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
News December 26, 2024
భాగవత్‌తో విభేదించిన RSS మ్యాగజైన్
మసీదు-మందిర్ వివాదాలపై RSS చీఫ్ మోహన్ భాగవత్‌తో ఆ శాఖ అనుబంధ మ్యాగజైన్ విభేదించింది. ఈ తరహా వివాదాలు అధికమవుతుండడంపై భాగవత్ గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులు కలిసి ఉండగలరన్న ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. అయితే RSSకు చెందిన ఓ మ్యాగజైన్ మాత్రం సివిలైజేషన్ జస్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.