News March 31, 2025

ఆయుధాలు పట్టండి.. మద్దతుదారులకు హమాస్ పిలుపు

image

ప్రపంచవ్యాప్తంగా తమ మద్దతుదారులందరూ ఆయుధాల్ని చేపట్టాలని హమాస్ పిలుపునిచ్చింది. గాజాలో ఉన్న 20లక్షల పైచిలుకు ప్రజల్ని అక్కడి నుంచి బయటికి తరలించాలన్న ట్రంప్ ప్రణాళికను భగ్నం చేయాలని పేర్కొంది. ‘ఓ వైపు ఊచకోత, మరోవైపు ఆకలితో గాజా పౌరుల్ని చంపాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. రాయి నుంచి బాంబు దాకా ఏదైనా చేతపట్టండి. ఈ కుట్రను అడ్డుకోండి’ అని స్పష్టం చేసింది.

Similar News

News April 2, 2025

ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

News April 2, 2025

శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం

image

AP: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.

News April 2, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్

image

భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రమే ఆడతానని తెలిపారు. మొత్తం 320 మ్యాచులు ఆడిన వందన 158 గోల్స్ చేశారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్ చేసిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. క్రీడా సేవలకు గుర్తుగా ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డులు వరించాయి.

error: Content is protected !!