News May 18, 2024
తకేడా ఫార్మా డెంగీ టీకాకు WHO గుర్తింపు

జపాన్కు చెందిన తకేడా ఫార్మా అభివృద్ధి చేసిన డెంగీ టీకా(TAK-003)కు WHO ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపునిచ్చింది. ఈ హోదా లభించిన రెండో టీకా ఇదే కావడం విశేషం. దీనివల్ల యునిసెఫ్, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఈ వ్యాక్సిన్ను సేకరిస్తాయి. HYDలోని బయోలాజికల్ ఇ.లిమిటెడ్ యూనిట్లలో ఈ టీకా 5 కోట్ల డోసులు ఉత్పత్తి కానున్నాయి. కాగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
Similar News
News December 9, 2025
VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
News December 9, 2025
అధికారం కోల్పోయాక విజయ్ దివస్లు.. BRSపై కవిత విమర్శలు

TG: బీఆర్ఎస్పై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఆ పార్టీ ‘విజయ్ దివస్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ చేశారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు.. విజయ్ దివస్లు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు!!’ అని రాసుకొచ్చారు. పార్టీ నుంచి బయటికొచ్చాక బీఆర్ఎస్పై కవిత తరచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
News December 9, 2025
వీసా రూల్స్ అతిక్రమించిన చైనా సిటిజన్.. అరెస్ట్

2 వారాల నుంచి లద్దాక్, జమ్మూ కశ్మీర్లో తిరుగుతున్న చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ షెంజెన్కు చెందిన హు కాంగ్టాయ్ను సెక్యూరిటీ ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ, UP, రాజస్థాన్లోని బౌద్ధ మత ప్రదేశాల సందర్శనకు NOV 19న టూరిస్ట్ వీసాపై అతడు ఢిల్లీ వచ్చాడు. రూల్స్ అతిక్రమించి లద్దాక్, J&K వెళ్లాడు. ఆర్టికల్ 370, CRPF బలగాల మోహరింపు, సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు ఫోన్లో సెర్చ్ చేశాడు.


