News April 8, 2024
ఆఫీసులో ఓ కునుకు తీస్తున్నారా?

చాలా మంది ఉద్యోగులకు మధ్యాహ్నం అయ్యే సరికి చిన్న కునుకు తీస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇది మంచిదే అంటున్నారు పరిశోధకులు. తరచూ మధ్యాహ్నం కాసేపు నిద్రపోయే వారి మెదడు మిగతా వారితో పోలిస్తే చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు వీరికి 6.5 ఏళ్లు ఆలస్యంగా వృద్ధాప్యం వస్తుందట. క్రియేటివిటీ పెరిగి, మెరుగైన పనితీరు కనబరిచే అవకాశాలు ఎక్కువ ఉండటంతో పలు ఆఫీసులు స్లీప్ టైమ్ను కూడా కేటాయిస్తున్నాయి.
Similar News
News October 31, 2025
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.
News October 31, 2025
యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు!

కర్ణాటకలోని మంగళూరులో మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ యాచకురాలు 13 ఏళ్లుగా చెత్త కుప్పల దగ్గర నివసిస్తోంది. ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా చెత్తలో ఉన్న సంచులను గట్టిగా పట్టుకుంది. అనుమానంతో వాటిని తెరిచి చూస్తే భారీగా నోట్లు, నాణేలు కనిపించాయి. వాటిని లెక్కిస్తే ₹లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యాచకురాలిని అనాథ శరణాలయానికి తరలించారు.
News October 31, 2025
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <


