News April 24, 2024
సా.6 గంటలకు ‘తలైవా 171’ టైటిల్, టీజర్

రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో ‘తలైవా 171’ మూవీ రానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇవాళ బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నారు. టైటిల్, టీజర్‌ను సా.6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘తలైవా 171’లో రజినీకాంత్ లగ్జరీ వాచ్‌లు చోరీ చేసే దొంగలా కనిపించునున్నట్లు సమాచారం.
Similar News
News March 17, 2026
శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.
News March 17, 2026
సినిమా పైరసీ చేస్తే మూడేళ్ల జైలు!

TG: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపడుతోంది. మూవీ పైరసీ చేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ తప్పదని CSB డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి సంయుక్తంగా యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 17, 2026
పెరగనున్న కార్ల ధరలు!

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.


