News September 10, 2024

వారితో మనసు విప్పి మాట్లాడండి

image

ఈమధ్య సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆత్మహత్యే శరణ్యం అన్నట్లుగా చాలామంది భావిస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే వారు ఆత్మహత్య చేసుకుంటామని నేరుగా చెప్పకపోయినా ఇన్‌డైరెక్ట్ మెసేజ్ ఇస్తారని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రవర్తనలో మార్పు, ముభావంగా ఉండటం, నిరాశనిస్పృహలు ఉంటే వారితో మాట్లాడి, మనోధైర్యం నింపితే ఆత్మహత్య నుంచి కాపాడవచ్చంటున్నాయి.
>> నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం.

Similar News

News December 10, 2025

వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

image

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.

News December 10, 2025

వివేకా హత్యకేసులో కోర్టు కీలక ఆదేశాలు

image

TG: వివేకా హత్యకేసులో పలు అంశాలపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని CBIని నాంపల్లి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో కేసును మళ్లీ విచారించాలని సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు కోర్టు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి కాల్ రికార్డింగుల ఆధారంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

News December 10, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలి.. TSUTF డిమాండ్

image

TG: నిన్న విద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి ఎగ్జామ్స్ <<18515127>>షెడ్యూల్‌పై<<>> తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(TSUTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 7 పేపర్లను 35 రోజుల పాటు నిర్వహించడం సరికాదంది. అశాస్త్రీయంగా రూపొందించిన SSC టైమ్ టేబుల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.