News September 9, 2024

బుడమేరుపై ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలి: పవన్

image

AP: వరద విపత్తు నుంచి కోలుకునేందుకు విజయవాడకు కాస్త సమయం పట్టొచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నది, వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా బుడమేరుపై ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని, తెలిసో తెలియకో చాలా మంది కొన్నారని తెలిపారు. భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు

image

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్(<>PDIL<<>>)87 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, BCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.pdilin.com

News November 8, 2025

తెలంగాణలో యాసంగి సాగుకు అనువైన వేరుశనగ రకాలు

image

TG: యాసంగి నీటి వసతి కింద రాష్ట్రంలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు కదిరి-6, కదిరి-7, కదిరి-8, కదిరి-9, కదిరి హరితాంధ్ర (కె-1319), కదిరి లేపాక్షి (కె-1812), ధరణి (T.C.G.S-1043), నిత్యహరిత (T.C.G.S-1157), విశిష్ట (T.C.G.S-1694), జగిత్యాల పల్లి (జె.సి.జి. 2141), టి.ఏ.జి-24, అభయ, ఇ.సి.జి.వి-9114, జగిత్యాల-88 (జె.సి.జి-88), గిర్నార్-4 (జి.సి.జి.వి-15083), గిర్నార్-5(ఐ.సి.జి.వి-15090) మొదలైనవి.

News November 8, 2025

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నవాజుద్దీన్

image

కెరీర్ ఆరంభంలో ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఏదైనా మూవీలో ఛాన్స్ వచ్చినా మళ్లీ పోతుందనే భావనలో ఉండేవాడినన్నారు. దీంతో ఆత్మహత్య ఆలోచనలూ వచ్చాయని చెప్పారు. 2012 నుంచి గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్, కహానీ, తలాష్ మూవీలు సక్సెస్ కావడంతో జీవితంపై ఆశ చిగురించిందని పేర్కొన్నారు.