News January 3, 2025
మంత్రి సీతక్కతో చర్చలు సఫలం.. CRTల సమ్మె విరమణ

TG: తమ డిమాండ్లు నెరవేర్చాలని కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల(CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మినిమం టైం స్కేల్ మినహా మిగతా అన్నింటికీ ఆమె సానుకూలంగా స్పందించారు. మహిళలకు 108 రోజుల ప్రసూతి సెలవు, ఐదో తేదీలోపు జీతాలు, డెత్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు.
Similar News
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.
News November 24, 2025
అనంతమైన పుణ్యాన్ని ఇచ్చే విష్ణు నామం

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః|
ఛన్దో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః||
విష్ణు సహస్ర నామాలకు రుషి ‘వేదవ్యాసుడు’. ఈ స్తోత్రం ఛందస్సు ‘అనుష్టుప్’. ఈ పారాయణంలో దేవకీ పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం. అయితే శ్లోకాలను పఠించే ముందు భక్తులు వివరాలు తెలుసుకోవాలి. విష్ణు నామాల మూలం, ఛందస్సు, ఆరాధ దైవం గురించి తెలుసుకొని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 24, 2025
క్రీడాకారులకు ఆర్మీలో ఉద్యోగాలు

<


