News September 28, 2024

ఫ్రెండ్ బర్త్‌డే ఈవెంట్‌లో తళుక్కుమన్న మహేశ్!

image

మహేశ్ బాబు జక్కన్న డైరెక్షన్లో చిక్కుకున్నప్పటి నుంచీ ఆయన అభిమానులు అప్‌డేట్ కోసం విలవిల్లాడుతున్నారు. అప్‌డేట్ సంగతి అలా ఉంచి, తమ హీరోను మళ్లీ ఎప్పుడు చూస్తామో అంటూ వాపోతున్నారు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్‌కు మహేశ్ వెళ్లగా ఆ ఫొటోల్ని SSMB ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ మహేశ్‌ ఈ లుక్‌లో ఎలా ఉన్నారు?

Similar News

News January 29, 2026

నలభై తర్వాత ఇవి తీసుకోండి

image

మెనోపాజ్ తర్వాత మహిళలు బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే సబ్జా గింజలు, సిట్రస్ పండ్లు, కోడిగుడ్లు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సరైన పోషకాలు అందడం వల్ల శారీరక మార్పులను తట్టుకుని ఆరోగ్యంగా జీవించడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. దీంతో పాటు నలభై దాటాక కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామంపై కూడా దృష్టి సారించాలని చెబుతున్నారు.

News January 29, 2026

రేపే ఓటీటీలోకి ధురంధర్

image

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బాలీవుడ్ సినిమా ‘ధురంధర్’ ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 30 (శుక్రవారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. రన్ టైమ్ 3 గం. 25 ని.లుగా ఉండనుంది. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,300 కోట్లు వసూలు చేసింది.

News January 29, 2026

ఇండియన్ నేవీలో 260 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>ఇండియన్<<>> నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in