News August 1, 2024
ర్యాంప్వాక్లో తళుక్కుమన్న రష్మిక-విక్కీ

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ర్యాంప్వాక్లో అదరగొట్టారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా కోచర్ వీక్ 2024లో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో వీరు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇదే కార్యక్రమంలో శోభిత ధూళిపాళ్ల వంటి పలువురు స్టార్లు వేర్వేరు ఫ్యాషన్ డిజైనర్ల కలెక్షన్లతో మెరిశారు.
Similar News
News April 11, 2026
ప్లూటోకు మళ్లీ గ్రహం హోదా దక్కనుందా?

నాసాకు ఓ 10 ఏళ్ల బాలిక రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లూటోకు మళ్లీ ‘గ్రహం’ హోదా కల్పించాలని కోరుతూ కేలా అనే బాలిక నాసాకు లేఖ రాసింది. ‘ప్లూటో ఓ మరగుజ్జు గ్రహం. దానికి గ్రహం అయ్యే అర్హత ఉంది’ అని ఆమె పేర్కొంది. దీనిపై నాసా చీఫ్ స్పందిస్తూ.. తాము దీని గురించి ఆలోచిస్తున్నామని సానుకూలంగా బదులివ్వడం విశేషం.
News April 11, 2026
మైక్రోసైటిక్ అనీమియా గురించి తెలుసా?

మైక్రోసైటిక్ అనీమియా వల్ల శరీరంలో రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ తగ్గి అలసట, మైకము, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాకుండా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపం కారణంగా కూడా మైక్రోసైటిక్ అనీమియా తలెత్తే అవకాశం ఉంటుంది.
News April 11, 2026
మెకాన్ లిమిటెడ్లో 24 పోస్టులు

రెగ్యులర్ ప్రాతిపదికన 24 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి మెకాన్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అకౌంటెంట్ 14, HR-02, అడ్మినిస్ట్రేషన్-02, సెక్రటేరియల్ సర్వీస్-06 పోస్టులున్నాయి. ICAI/ ICMAIలో ఇంటర్మీడియట్, BBA పూర్తి చేసి, 28 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 6-5-26. మరిన్ని వివరాలకు meconlimited.co.in చూడండి.


