News March 6, 2025
ప్రియుడితో తమన్నా బ్రేకప్.. కారణమిదే?

హీరోయిన్ తమన్నా, విజయ్ శర్మ <<15649806>>విడిపోయారంటూ <<>>జరుగుతున్న ప్రచారానికి వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థలే కారణంగా తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలనుకుంటుండగా విజయ్ నుంచి సానుకూలత రాలేదని సమాచారం. అలాగే ఆమె నియంత్రించే స్వభావం కారణంగా ఇరువురి మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయని టాక్. ఈ కారణాలతోనే వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Similar News
News March 6, 2025
ఇకపై ‘మనమిత్ర’లో 200 సేవలు: లోకేశ్

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో ఇకపై ప్రజలకు 200 సేవలు అందుతాయని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మన మిత్ర’ అద్భుత మైలురాయి దాటిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదో నిదర్శనం అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
News March 6, 2025
ఏపీలో ‘ఛావా’ సినిమాపై వివాదం

‘ఛావా’ సినిమాను ఏపీలో రిలీజ్ చేయొద్దని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హక్ డిమాండ్ చేశారు. ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారని, రిలీజ్‌ను ఆపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. ఇందులో ముస్లింలను తప్పుగా చూపారని ఆయన ఆరోపించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.
News March 6, 2025
‘ప్యారడైజ్’లో నాని లుక్ వెనుక కథ ఇదే!

‘ప్యారడైజ్’ టీజర్‌లో నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్‌తో పాటు జడలు వేసుకొని కనిపించారు. అందరినీ ఆకర్షించిన ఆ లుక్‌పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించారు. రెండు జడలకు, తన బాల్యానికి కనెక్షన్ ఉందని చెప్పారు. చిన్నప్పుడు తనను తల్లి అలాగే జడలు వేసి పెంచిందని, ఆ స్ఫూర్తితోనే నాని పాత్రను డిజైన్ చేశానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్యారడైజ్’ మూవీ 2026 మార్చిలో విడుదల కానుంది.