News February 4, 2025
‘అల వైకుంఠపురంలో’ తమిళ మూవీ అన్న పూజ.. నెటిజన్ల ఫైర్

అల్లు అర్జున్, తాను కలిసి నటించిన ‘అల వైకుంఠపురంలో’.. తమిళ సినిమా అని పూజా హెగ్డే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అది తమిళ సినిమా అయినా హిందీ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారని ‘దేవా’ మూవీ ప్రమోషన్లలో పూజ కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేశారని, అంత పెద్ద హిట్ అయిన సినిమానే మర్చిపోతారా? అని ఫ్యాన్స్ పూజపై మండిపడుతున్నారు.
Similar News
News November 24, 2025
మెనోపాజ్లో ఎముకలు జాగ్రత్త

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ని తీసుకోవాలంటున్నారు.
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.


