News April 25, 2024
పుర్రెలతో తమిళనాడు రైతుల నిరసన

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు నిన్న ఎముకలు, పుర్రెలతో బైఠాయించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇవి ఆత్మహత్య చేసుకున్న రైతులవని నిరసనకారులు చెబుతున్నారు. ‘వ్యవసాయంలో ఆదాయం రెట్టింపు, నదుల అనుసంధానం చేస్తామని 2019లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవి నెరవేరలేదు. ఒకవేళ కేంద్రం మా డిమాండ్స్ తీర్చకుంటే వారణాసిలో మోదీపై పోటీ చేస్తాం. మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వారము కాదు’ అని తెలిపారు.
Similar News
News March 10, 2026
భారత్‌లో 53% పెరిగిన ఐఫోన్ల తయారీ

భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ భారీగా పెరిగింది. గత ఏడాది ఇక్కడ 55 మిలియన్ ఐఫోన్లు తయారైనట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది 36 మిలియన్ ఐఫోన్లు తయారు కాగా 2025లో ఇది 53% పెరిగింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 220-230 మిలియన్ ఐఫోన్లు తయారు అవుతుండగా.. అందులో భారత్ వాటా ఇప్పుడు 25%కు చేరింది. US-చైనా ట్రేడ్ టెన్షన్స్ నేపథ్యంలో యాపిల్ ఇండియాలో తమ ఉత్పత్తులను పెంచుతున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2026
ఈ ఇద్దరు MPలు జీతాలు తీసుకోవట్లే!

ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా చాలామంది పార్లమెంటేరియన్లు జీతాలు వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం 18వ లోక్‌సభలో మొత్తం 543 మందిలో కేవలం ఇద్దరే జీతభత్యాలు తీసుకోవట్లేదని RTI ద్వారా తెలిసింది. హరియాణా BJP MP నవీన్ జిందాల్ జీతంతో పాటు అన్ని అలవెన్సులను వదులుకోగా కాంగ్రెస్ MP అంగోమ్చా బిమోల్ అకోయిజామ్(మణిపుర్) తన వేతనాన్ని నిరాకరించారు. పదవి ప్రజాసేవకే తప్ప సంపాదనకు కాదు అని వీరు నిరూపించారు.
News March 10, 2026
ఫైనల్లో గొడవ.. అర్ష్‌దీప్‌కు ICC ఫైన్

T20 WC ఫైనల్లో కివీస్ బ్యాటర్ మిచెల్‌పైకి బంతి విసిరిన ఘటనలో భారత బౌలర్ అర్ష్‌దీప్‌పై ICC చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అర్ష్‌దీప్ ICC ప్రవర్తనా నియమావళి లెవెల్-1 ఉల్లంఘించారని పేర్కొంది. కాగా ఫైనల్ మ్యాచులో మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా అర్ష్‌దీప్ బంతి అందుకొని అతడిపైకి విసిరేయడంతో <<19332640>>గొడవ<<>> జరిగింది. తర్వాత మిచెల్‌కు అర్ష్‌దీప్ క్షమాపణ చెప్పారు.


