News April 5, 2025
వృద్ధి రేటులో తమిళనాడు ఫస్ట్, ఏపీ సెకండ్

2024-25కి గాను ఆర్థిక వృద్ధి రేటులో ఏపీ 8.21 శాతంతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధితో తమిళనాడు తొలిస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత రాజస్థాన్- 7.82%, హరియాణా- 7.55%, కర్ణాటక- 7.37%, మహారాష్ట్ర- 7.27%, తెలంగాణ- 6.79% ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది.
Similar News
News April 5, 2025
3 అంతస్తుల్లో అసెంబ్లీ, 7 అంతస్తుల్లో హైకోర్టు: చంద్రబాబు

AP: అమరావతి నిర్మాణం కోసం మిగతా నిధులను వివిధ కార్పొరేషన్ల నుంచి సమీకరించేందుకు CRDAకు అనుమతిస్తూ దానిపై సమీక్షలో CM చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ(L&T), హైకోర్టు(NCC) నిర్మాణాల టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అసెంబ్లీని బేస్మెంట్+G+3+వ్యూ పాయింట్లు+పనోరమిక్ వ్యూ, హైకోర్టు బేస్ మెంట్ + G + 7 అంతస్తుల్లో 55 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.
News April 5, 2025
హత్తుకునే కథతో 7/G సీక్వెల్: సెల్వ రాఘవన్

7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూట్ 50% పూర్తయ్యిందని డైరెక్టర్ సెల్వ రాఘవన్ వెల్లడించారు. మనసును హత్తుకునే కథతో రెడీ చేస్తున్నామన్నారు. హీరోయిన్ చనిపోయాక హీరో(రవికృష్ణ) జీవితం ఎలా సాగిందనే అంశాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్‌పై మాట్లాడుతూ ‘ఇది క్లిష్టమైన కథ. భారీగా ఖర్చవుతుంది. నిర్మాత కోసం చూస్తున్నాం. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తారు. కార్తి కూడా ఉంటారు’ అని చెప్పారు.
News April 5, 2025
PBKSvsRR: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 205/4 స్కోర్ చేసింది. జైస్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43*, నితీశ్ రాణా 12, హెట్మయర్ 20 పరుగులు చేశారు. ఫెర్గ్యూసన్ 2, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 206 రన్స్ చేయాలి.