News June 4, 2024

తమిళి సై వెనుకంజ

image

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ చెన్నై సౌత్ నుంచి ఎంపీగా పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లోనూ ఆమె ఓటమి దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే అభ్యర్థి సుమతి 6148 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎంపీగా గెలుస్తాననే ధీమాతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కాగా 2019లో డీఎంకే అభ్యర్థి తమిజాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Similar News

News October 7, 2024

జానీ మాస్టర్‌ బెయిల్ రద్దు కోసం కోర్టుకు పోలీసులు!

image

అత్యాచారం కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

News October 7, 2024

అడిగిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించాం: తమిళనాడు మంత్రి

image

చెన్నై ఎయిర్ షోకు కోరిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వైద్య బృందాలతో పాటు 40 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిన్న ఈవెంట్‌కు వచ్చిన జనం అవస్థలు పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని BJP రాష్ట్ర చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.

News October 7, 2024

నేడు విచారణకు నాగార్జున పిటిషన్

image

తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది.