News February 16, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘తండేల్’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వారం రిలీజైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు.
Similar News
News March 13, 2025
రేపు వైన్స్ బంద్

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో రేపు(14న) మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
News March 13, 2025
IPL: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్‌లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్‌లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.
News March 13, 2025
దస్తగిరికి భద్రత పెంపు

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్‌మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.