News February 9, 2025

‘తండేల్’ మూవీ కలెక్షన్ల సునామీ

image

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండ్రోజుల్లో ఈ సినిమాకు రూ.41.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బ్లాక్‌బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. చైతూ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ సినిమాగా నిలిచే అవకాశం ఉండగా, ఇవాళ సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Similar News

News March 26, 2026

ALERT: టేస్ట్ కోసం చూస్తే.. ప్రాణాపాయమే!

image

ఫాస్ట్‌ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే మీరు డయాబెటిక్ వ్యాధిని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే TG, AP, TN, కేరళం, కర్ణాటకలో ఫాస్ట్‌ఫుడ్ వినియోగం పెరిగిందని IJMR స్టడీ వెల్లడించింది. బయటి ఆహారంపై ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే షుగర్, ఊబకాయం బారిన పడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రూరల్ ఏరియాలో కంటే సిటీల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంది.

News March 26, 2026

కరెంట్ అఫైర్స్

image

* JNTUH బీటెక్ విద్యార్థి శివకుమార్ ఇందూరికి ‘జలశక్తి హ్యాకథాన్ 2025’ పురస్కారం.
* సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,07,879.
* నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, IIT మద్రాస్ రోడ్లపై ‘పొగమంచును హరించే’ టైటానియం డయాక్సైడ్ పూతలను పరీక్షిస్తున్నాయి.
* పుణేలోని శాస్త్రవేత్తలు Neoloboptera peninsularis అనే కొత్త బొద్దింక జాతిని కనుగొన్నారు.

News March 26, 2026

BCCI హోమ్ షెడ్యూల్.. 9 వన్డేలు ఆడనున్న విరాట్, రోహిత్!

image

2026-27 హోమ్ సీజన్‌లో భారత జట్టు ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ను BCCI రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 27-అక్టోబర్‌17 మధ్య వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 T20ల సిరీస్‌లు జరగనున్నాయి. డిసెంబర్‌ 13-27 మధ్య శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20ల సిరీస్‌లు, జనవరి 3-9 మధ్య జింబాబ్వేతో 3 వన్డేలు, జనవరి 21-ఫిబ్రవరి 27 మధ్య ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడనుంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 9 వన్డేలు ఆడే ఛాన్స్ ఉంది.