News February 7, 2025
‘తండేల్’ మూవీ రివ్యూ

హీరోతో పాటు అతడి జాలర్ల బృందాన్ని పాక్ చెర నుంచి విడిపించేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నమే ‘తండేల్’ కథ. నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. బుజ్జితల్లి, హైలెస్సా సాంగ్స్ బాగున్నా ఒకే బీజీఎం రిపీట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ హత్తుకుంటాయి. ఫస్టాఫ్ స్లోగా సాగడం, జైల్లో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది.
రేటింగ్: 2.75/5
Similar News
News January 18, 2026
జోరందుకున్న మద్యం అమ్మకాలు

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.
News January 18, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<
News January 18, 2026
చైనాలో నోరోవైరస్ కలకలం.. కొత్తదేనా?

చైనాలోని ఓ స్కూల్లో 100 మందికి పైగా విద్యార్థులు నోరోవైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 1968లోనే USలో బయటపడింది. భారత్లో కూడా గతంలో కేరళ, పుణే వంటి నగరాల్లో ఈ వైరస్ కలకలం రేపింది. ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం తక్కువే. అయినా తీవ్రమైన నీరసం, డీహైడ్రేషన్, డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


