News February 10, 2025

‘తండేల్’ పైరసీ.. ఆర్టీసీకి నిర్మాత విజ్ఞప్తి

image

APSRTCకి చెందిన బస్సులో ‘తండేల్’ పైరసీ వెర్షన్ ప్రదర్శన చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. WAY2NEWS కథనాన్ని ప్రస్తావిస్తూ ఇలా ప్రదర్శన చేయడం చట్టవిరుద్ధమని, సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడిన వారికి అవమానమని పేర్కొన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును కోరారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు.

Similar News

News December 1, 2025

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో వాహనదారులు అవస్థలు

image

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మూడు లైన్ల రోడ్లు ఉన్నా సరే నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని దినాలు ఉండటంతో ఆ సమయాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్‌లోనే పోగొట్టుకుంటున్నామని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాధ పడుతున్నారు. ఇటు కంపెనీలు, అటు ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.

News December 1, 2025

కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News December 1, 2025

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

image

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్‌మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/