News March 6, 2025
నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘తండేల్’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ ఇవాళ అర్ధరాత్రి ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో కూడా ఈ మూవీ ప్రసారం కానుంది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 7న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి సత్తా చాటింది.
Similar News
News March 28, 2026
వేసవిలో హాయిగా నిద్రపట్టాలంటే?

పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ బెడ్ షీట్స్ వాడితే చల్లగా ఉంటాయి. రాత్రి మసాలాలు ఎక్కువగా ఉండే భోజనం తినొద్దు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పడుకునే గంట ముందు గ్లాస్ మజ్జిగ లేదా గోరువెచ్చని పాలు తాగితే శరీరం చల్లబడుతుంది. సాయంత్రం తర్వాత టీ, కాఫీ దూరం పెట్టాలి. పడుకునే ముందు నీరు ఎక్కువగా తాగొద్దు.
News March 28, 2026
ఆ జిల్లాలకు APSDMA బిగ్ అలర్ట్

AP: రాష్ట్రంలోని 35 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు, 87 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, NTR జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండే ఆస్కారముందని చెప్పింది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాలో 40°C-42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఇవాళ మార్కాపురం(D) బొట్లగూడురులో 42.6°C ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది.