News October 28, 2024
టపాసుల వ్యాపారం.. తుస్సు.. తుస్సు..
AP: మరి కొద్ది రోజుల్లో దీపావళి పండుగ. కానీ బాణసంచా మార్కెట్‌లో సందడి లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్‌లో 70-80% వరకు అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 25శాతం వ్యాపారం కూడా జరగలేదని విజయవాడలో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రతి ఇంట్లో చెప్పుకోలేనంత నష్టం జరిగింది. దీనికి తోడు పెరిగిన నిత్యావసర ధరలతో టపాసుల కొనడంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిందంటున్నారు వ్యాపారులు.
Similar News
News November 1, 2024
IPL రిటెన్షన్: టీమ్‌ల వారీగా జాబితాలు ఇవే(PHOTOS)
IPL-2025కు ముందు కీలకమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. పది జట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. స్టార్ ప్లేయర్లను వదులుకున్న కొన్ని టీమ్‌ల నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించగా, మరికొన్ని యంగ్ టాలెంట్‌కు పట్టం కట్టాయి. రిటెన్షన్‌లో నిలిచిన ప్లేయర్లను టీమ్‌ల వారీగా పైన ఫొటోల్లో చూడవచ్చు. త్వరలోనే జరిగే మెగా వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News November 1, 2024
హిందువులపై దాడిని ఖండిస్తున్నా: ట్రంప్
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
News November 1, 2024
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
APలోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.