News May 19, 2024

నాలుగు నెలల్లోనే 1,300 ఫోన్లు ట్యాపింగ్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. MLA ఎన్నికల ముందు ఆగష్టు నుంచి నవంబర్ వరకు 1,300 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. SIB కేంద్రంగా ఈ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. ఎన్నికలు ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. BRS అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల ఫోన్లే ట్యాప్ అయినట్లు టాక్. అధికారులు ఫోన్ ట్యాప్ బాధితుల వాంగ్మూలం తీసుకుంటున్నట్లు సమాచారం.

Similar News

News November 19, 2025

అన్నదాత సుఖీభవ రెండో విడత.. రూ.3,135 కోట్లు జమ

image

AP: పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన 46,85,838 రైతుల అకౌంట్లలో రూ.3,135 కోట్లను జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద రూ.5వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.

News November 19, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 9

image

50. జ్ఞానం అంటే ఏమిటి? (జ.మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)
51. దయ అంటే ఏమిటి? (జ.ప్రాణులన్నింటి సుఖం కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? (జ.సదా సమభావం కలిగి ఉండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (జ.ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? (జ.ఇంద్రియ నిగ్రహం)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 19, 2025

PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

image

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.