News March 24, 2024
ఫోన్ ట్యాపింగ్.. ఎవరూ నోరు మెదపరే?

TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. కేసీఆర్ హయాంలో SIB డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును అరెస్ట్ చేసి కూపీ లాగగా.. ఏస్పీలు భుజంగరావు, తిరుపతన్న పేర్లు బయటికొచ్చాయి. తాజాగా వారినీ రిమాండ్‌కు తరలించారు. ఇంత జరుగుతున్నా.. అధికార, విపక్షాలు మౌనంగా ఉండటం గమనార్హం. అయితే సైలెంట్‌గా దీని వెనుక ఉన్న ‘పెద్ద తలకాయలను’ బయటికి లాగాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
విశాఖ: పాఠశాలలో బాలికల వాష్‌రూమ్ వద్ద యువకుడి వెకిలి చేష్టలు

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు బాలికల వాష్‌రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకటరావుకు సమాచారం అందించారు. ప్రధానోపాధ్యాయుడు తక్షణమే పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News December 5, 2025
రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్‌కు ఆహ్వానం

రాష్ట్రపతి భవన్‌లో కాసేపట్లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్‌లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.
News December 5, 2025
ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో <<18478689>>సాయి ఈశ్వర్<<>> బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని హరీశ్‌రావు చెప్పారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ‘ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.


